ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ లను ప్రభుత్వం ఆదుకోవాలి వెంటనే విధులోకి తీసుకోవాలి.
జనని న్యూస్ హైదరాబాద్ లోకల్ Ch. కిరణ్ కుమార్ రిపోర్టింగ్ 👉మేము గత సంవత్సరం 2020 మార్చి నెలలో ఒక పది రోజులు సమ్మె చేయడం జరిగింది ఆ సమ్మె ఎందుకనగా 4779 అనే ఒక జీవో జారీ చేసింది కాబట్టి ఆ జీఓ టార్గెట్ విధించడం జరిగింది కావున మమ్ముల్ని పొమ్మనలేక పొగబెట్టడం ద్వారా మేము సమ్మెకు వెళ్లడం జరిగింది . కావున ప్రభుత్వం మాపైనే మీరు సమ్మె దిగుతారా అని తాత్కాలికంగా తొలగించడం జరిగింది కావున మేము ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు ఎంపీలకు మంత్రులకు కేటీఆర్ గారికి కవిత గారికి అందరికీ ప్రతి ఒక్కరికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఎక్కని మెట్టు లేదు మొక్కని కాళ్లు లేవు అయినా కూడా ప్రభుత్వం దయ తలచడం లేదు ఈరోజు క్యాబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి మీడియా ద్వారా వాళ్ళకు మా సమస్యలు తెలియజేయగలరని తెలంగాణ ఫీల్డ్ అసిస్టెంట్ అందరు కోరుచున్నారు.
రిపోర్టర్
Ch. కిరణ్ కుమార్
Comments
Post a Comment