మానసిక వికలాంగుల కేంద్రాన్ని యధావిధిగా కొనసాగించాలి.

జనని న్యూస్ హైదరాబాద్ లోకల్ Ch. కిరణ్ కుమార్  రిపోర్టింగ్ 👉08.06.2021 ఆరంభంలోనే మానసిక వికలాంగుల కేంద్రాన్ని యధావిధిగా కొనసాగించాలి
16 ఎకరాల స్థలంలో వికలాంగుల కోసం ఇంటిగ్రేటెడ్ హోమ్స్ నిర్మించాలి 
కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా... వినతి పత్రం 
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అరంఘర్లో కొనసాగుతున్న మానసిక వికలాంగుల కేంద్రాన్ని యధావిధిగా కొనసాగించాలని, ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న 16 ఎకరాల స్థలంలో వికలాంగుల కోసం ఇంటిగ్రేటెడ్ హోమ్స్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD)తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మలక్పేట్లోని కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం అసిస్టెంట్ డైరెక్టర్ రాజగోపాల్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
      ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె వెంకట్, ఏం అడివయ్య మాట్లాడుతూ 69 సంవత్సరాల నుండి ఆరంగర్లో మానసిక వికలాంగుల కేంద్రం సాగుతుందని, అకస్మాత్తుగా రాష్ట్ర ప్రభుత్వం మానసిక వికలాంగుల కేంద్రాన్ని మూసివేయాలని నిర్ణయించడం సరైంది కాదని అన్నారు. కేంద్రం మూసివేయాలని నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. మానసిక వికలాంగుల కోసం ప్రత్యేక హోమ్స్ నిర్మించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోని పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. సౌకర్యాలు లేవని కారణంతో మానసిక వికలాంగుల కోసం కొనసాగుతున్న కేంద్రాన్ని మూసివేయడం అనేక అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ప్రభుత్వ భూములు అమ్మి ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ఆలోచనలో భాగంగానే మానసిక వికలాంగుల కేంద్రాన్ని మూసివేసినరని అన్నారు. మానసిక వికలాంగుల సంక్షేమం కోసం ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో అనేక దఫాలుగా చర్చలు జరిగాయని అవేవీ నేడు అమలుకు నోచుకోవడం లేదన్నారు. రాష్ట్రం లో ఉన్నటువంటి వికలాంగుల స్థలాలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. వికలాంగుల సంక్షేమం కోసం చర్యలు చేపట్టకుండా వికలాంగుల స్థలాలను అమ్మేహక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడిదని ప్రశ్నించారు. అరంఘర్లోని 16 ఎకరాల స్థలంలో వికలాంగుల కు ఉపయోగపడే భవనాలను నిర్మించాలని డిమాండ్ చేశారు. ఆ స్థలంలో గ్రేటర్ హైదరాబాదులో ఉన్న నిరుపేద వికలాంగులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మానసిక వికలాంగుల కోసం ప్రత్యేక హోమ్ నిర్మించేందుకు ఆ స్థలాన్ని వినియోగించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మానసిక వికలాంగుల కోసం ప్రత్యేక హోమ్స్ లేకపోవడం ద్వారా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టంలో సైతం మానసిక వికలాంగుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎందుకు అమలుకు నోచుకోవడం లేదని ప్రశ్నించారు. మానసిక వికలాంగుల కేంద్రం యధావిధిగా కొనసాగించే వరకు ఉద్యమం చేస్తామని, ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న 16 ఎకరాల స్థలంలో వికలాంగులకు ఉపయోగపడే భవనాలు నిర్మించాలని లేనియెడల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు 
 *ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాం* . *అసిస్టెంట్ డైరెక్టర్* 
మానసిక వికలాంగుల కేంద్రం మూసివేతపై మరియు 16 ఎకరాల స్థలంలో వికలాంగుల అవసరాల కోసం ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వికలాంగులు వయో వృద్ధుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాజగోపాల్ హామీ ఇచ్చారు.
  ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి ఆర్ వెంకటేష్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జర్కొని రాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆశన్న గారికి భుజంగరెడ్డి, రాజశేఖర్ గౌడ్, రంగారెడ్డి, మల్లేష్, నజీయ, మహమ్మద్, శశికళ తదితరులు పాల్గొన్నారు
*ఆర్ వెంకటేష్* 
రాష్ట్ర కోశాధికారి.

Comments

Popular posts from this blog

పురుషుల్లో సెక్సవల్ బాగుండాలి అంటే ఇవి ఉపయోగపడుతాయి.(ఆర్టికల్ )జనని న్యూస్ హైదరాబాద్ Ch. కిరణ్ కుమార్. 👇

*థర్డ్ వేవ్ ఆందోళన వద్దు*.. పిల్లల చేత ఇలా చేయించండి చాలు.

దీన స్థితిలో వున్న ఈ అబగ్యులను ఆదుకోండి.