ఆరంఘర్ లోని మానసిక వికలాంగుల కేంద్రం మూసివేత నిర్ణయం ప్రభుత్వా సిగ్గు మాలిన చర్య. గోరెంకల నర్సింహ్మా NPRD రాష్ట్ర గౌరవ అధ్యక్షులు.

ప్రచురణార్థం: జనని న్యూస్ హైదరాబాద్ రిపోర్టర్ Ch. కిరణ్ కుమార్
06.06.2021 ఆరంఘర్ లోని మానసిక వికలాంగుల కేంద్రం మూసివేత నిర్ణయం ప్రభుత్వా సిగ్గు మాలిన చర్య. 
 గోరెంకల నర్సింహ్మా NPRD రాష్ట్ర గౌరవ అధ్యక్షులు 
69 ఏళ్ల చరిత్ర ఉన్న ఆరాంఘర్‌ మానసిక వికలాంగుల కేంద్రాన్ని మూసివేయాలని ఆలోచనల్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని, సౌకర్యాలు కల్పించకుండా దాన్ని మూసివేసి మానసిక వికలాంగులకు అన్యాయం చేసే నిర్ణయాన్ని  వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD)  తీవ్రంగా ఖండిస్తుందని NPRD తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గోరెంకల నర్సింహ్మా అన్నారు. ఈరోజు ఆరంఘర్ లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ మానసిక వికలాంగుల కేంద్రం గేటు ముందు వికలాంగుల ధర్నా తో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి NPRD రాష్ట్ర ‌గౌరవ అధ్యక్షులు గోరెంకల నర్సింహ్మా హాజరై అయిన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మంచి రోజులు వస్తాయని, వికలాంగుల బ్రతుకులు మరుతయని అనుకుంటే కె సి అర్ అధికారంలోకి వచ్చిన 7 ఎడ్లలో ప్రభుత్వ ఆస్తులను కార్పోరేట్ సంస్థ లకు అమ్మేసి ప్రభుత్వం ఖజానా నింపుకోవాలని చూస్తుందని మండి పడ్డారు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నప్పుడు  దనిక రాష్ట్ర అని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు వికలాంగుల సేవ కేంద్రాల భూములపై కన్ను ఎందుకు పడిందని ఎద్దేవా చేశారు‌. 
రంగారెడ్డి జిల్లా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆరాంఘర్‌ చౌరస్తా సమీపంలో వందల కోట్ల విలువ చేసే మానసిక వికలాంగుల కేంద్రంకు చెందిన  16 ఎకరాలను భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూముల్ని అమ్మి ఆదాయాన్ని పొందాలనే రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయంలో భాగంగానే  రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ అధికారులు కనీస వసతులు లేవని, అసౌకర్యాల మధ్య వారు గడుపుతున్నారని కారణంతో మానసిక వికలాంగుల కేంద్రాన్ని మూసివేయాలని నిర్ణయించడం సరైంది కాదని ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగల పెట్టినట్లు ప్రభుత్వ వైఖరి ఉందని విమర్శించారు. అక్కడ ఉంటున్న వికలాంగులు, వృద్ధులైన 77 మందిని  వేర్వేరు ఆశ్రమాలకు అర్థ రాత్రి తరలించాల్సిన అవసరం అధికారులకు ఎముందని ప్రశ్నించారు. ఈ సంస్థను 1952లో పేదలు, వృద్ధులు, వికలాంగులు, అనాథలకు సేవల కోసం గవర్నర్‌ల ఆధ్వర్యంలో రెడ్‌ క్రాస్‌ సొసైటీలు ఏర్పాటు చేయాలని స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు రాజకీయ ప్రముఖుల ఆధ్వర్యంలో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సోషల్‌ వెల్ఫేర్‌ తరఫున స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసి సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. 1952లో ఐఏఎస్‌ అధికారి వెల్లోడి సతీమణి నేతృత్వంలో మంగళ్‌హాట్‌ కేంద్రంగా వికలాంగుల కేంద్రాన్ని  ప్రారంభించింది. ఈ కేంద్రానికి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, పీవీ నర్సింహారావు, కాసు బ్రహ్మానంద రెడ్డిలాంటి వారు సేవలందించారు. తర్వాత ఈ కేంద్రానికి ఇచ్చిన స్థలాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుని 1964లో శివరాంపల్లిలో 18 ఎకరాలను కేటాయించింది. తొలుత వికలాంగుల కేంద్రంగా ఉన్నా1964 నుంచి మానసిక వికలాంగుల కేంద్రంగా నడుస్తుంది
   
      మానసిక వికలాంగుల కేంద్రo శంషాబాద్‌ విమానాశ్రయంకు దగ్గరలో ఉండడం ద్వారా కోట్లాది రూపాయల విలువ చేసే మానసిక వికలాంగుల కేంద్రం పై రాష్ట్ర ప్రభుత్వం కన్ను పడింది.లాక్‌డౌన్‌తో ప్రభుత్వ ఆదాయం పడిపోయిన నేపథ్యంలో సర్కారు స్థలాలను గుర్తించి విక్రయించాలని అధికారులకు ఆదేశాలు వెళ్లిన నేపథ్యంలోనే ఈ కేంద్రాన్ని ఖాళీ చేయించడం జరిగినది. ఇప్పటికే మలక్ పేట లో ఉన్న వికలాంగుల సంక్షేమ శాఖకు చెందిన స్థలాలను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ప్రభుత్వం ఆదాయం పొందేందుకు వికలాంగుల స్థలాలను ఎందుకు ఎంచుకుంటుంది అని ప్రశ్నిస్తుంది. లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూముల్లో రాష్ట్రంలో లక్షల ఎకరాలు ఉన్నప్పటికీ కీ వాటి జోలికి వెళ్లకుండా వికలాంగుల కోసం ఉన్నటువంటి కొద్దిపాటి ఆస్తులను కూడా అమ్మి వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం వికలాంగుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతుంది. గ్రేటర్ హైదరాబాద్ లో వికలాంగుల కోసం నడుస్తున్న హాస్టల్స్ హోమ్స్ సొంత భవనాలు లేక లక్షల రూపాయలు అద్దె భవనాలకు కట్టుతున్నారు.అవి కూడా అరకొర వసతులతో నడుస్తున్నాయి. అరంఘర్ లోని మానసిక వికలాంగుల కేంద్రంకు చెందిన 16 ఎకరాల స్థలంలో వికలాంగులకు ఉపయోగపడే రెసిడెన్షియల్ స్కూల్, కాలేజ్లు  భవనాలను నిర్మించాలని NPRD డిమాండ్ చేస్తుంది.

     ఆరాంఘర్‌ మానసిక వికలాంగుల కేంద్రంలో అధ్వాన్న పరిస్థితులున్నాయని పడుకోవడానికి సరైన వసతులు లేవని, కేంద్రం నిర్వహణ సరిగా లేదని,  అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని భావించి కేంద్రాన్ని మూసి వేస్తున్నామని వికలాంగుల సంక్షేమ శాఖ అధికారులు చెప్పడం అనేక అనుమానాలకు తావిస్తుంది సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులు సౌకర్యాలు లేవు అనే కారణంతో నిరుపేద వికలాంగులు వృద్ధులకు మానసిక వికలాంగులకు అన్యాయం చేయడం సరైంది కాదు. ఆరంఘర్లోని మానసిక వికలాంగుల కు చెందిన 16 ఎకరాల స్థలాన్ని దేని కోసం ఉపయోగిస్తారు చెప్పకుండా స్వాధీనం చేసుకోవడంలో ఆంతర్యం ఏమిటి దేశంలో ఎక్కడా లేని విధంగా గా వికలాంగుల సంక్షేమ శాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖ లో కలిపి వికలాంగులకు తీరని అన్యాయం చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి మానసిక వికలాంగులకు చెందిన వందల కోట్లు రూపాయల విలువ చేసే 16 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకొని మళ్లీ మోసం చేయడానికి పూనుకుంది.
అక్కడివారిని ప్రమాదకర పరిస్థితుల్లో ఉంచినందుకు, దాతలు ఇచ్చిన సరుకులు, వస్తువులను లబ్ధిదారులకు ఇవ్వకుండామోసం చేసిన మానసిక వికలాంగుల కేంద్రం నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని NPRD డిమాండ్ చేస్తుంది రాష్ట్రంలో ఇప్పటికే అనేక క సంస్థలు నిర్వహిస్తున్న హోమ్లు రిహాబిలిటేషన్ సెంటర్లు అక్రమాలకు నిలయాలుగా మారుతున్నాయి స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న పునరావాస కేంద్రాల పై సమగ్ర విచారణ జరిపించాలని NPRD డిమాండ్ చేస్తుంది స్వాధీనం చేసుకున్న 16 ఎకరాల స్థలాన్ని వికలాంగుల సంక్షేమం కోసం ఉపయోగించకుండా ప్రభుత్వ ఆదాయం కోసం అమ్మేందుకు ప్రయత్నిస్తే ఉద్యమం చేస్తామని NPRD  హెచ్చరిస్తుంది.  మేమే కాకుండ ఇతర వికలాంగుల సంఘాలు, ప్రజ సంఘాలు, సామాజిక కార్యకర్తలను ఐక్యం చేసి ఉద్యమం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో 
NPRD రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు అశాన్నగారి భుజంగ రెడ్డి, ప్రధాన కార్యదర్శి, జేర్కోని రాజు, జిల్లా కోషాదికారి,డి రాజా శెకర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు సయ్యద్ అప్రోజ్,సమాఖ్య అధ్యక్షులు సయ్యద్ మహబూబ్, సి ఐ టి యు రాజేంద్రనగర్ నగర్ సర్కిల్ కార్యదర్శి, కుర్మయ,మండల నాయకులు ఘట్టయ్య,మొహన్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు 
జేర్కోని రాజు 
జిల్లా ప్రధాన కార్యదర్శి 
NPRD.
Reporter
Ch. కిరణ్ కుమార్
హైదరాబాద్ స్టాఫ్ 

Comments

Popular posts from this blog

పురుషుల్లో సెక్సవల్ బాగుండాలి అంటే ఇవి ఉపయోగపడుతాయి.(ఆర్టికల్ )జనని న్యూస్ హైదరాబాద్ Ch. కిరణ్ కుమార్. 👇

*థర్డ్ వేవ్ ఆందోళన వద్దు*.. పిల్లల చేత ఇలా చేయించండి చాలు.

దీన స్థితిలో వున్న ఈ అబగ్యులను ఆదుకోండి.